మంత్రి ఎర్రబెల్లిని కలిసిన సర్పంచి నవ్య

స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఓ వైపు ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనరసింహతో భేటీ కాగా.. రాజయ్యపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన సర్పంచి నవ్య బీఆర్ఎస్ టికెట్టు తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. 

ఈ క్రమంలో ఆమె సెప్టెంబర్ 4న జనగామ జిల్లా పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే టికెట్టు తనకే ఇవ్వాలని ఎర్రబెల్లిని కోరారు. 

వారిరువురి భేటీపై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అనంతరం నవ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే టికెట్టు విషయంలో త్వరలో తాను సీఎం కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను కలవనున్నట్లు చెప్పారు.