పెండింగ్ బిల్లుల కోసం కరీంనగర్ సర్పంచ్ లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి దండం పెట్టి వేడుకున్నారు. మూడు నెలలుగా పెండింగ్ బిల్లులు రావటం లేదంటూ మంత్రి ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ కలెక్టరేట్ లో బాలల రక్షణ కమిటీల పాత్రపై సర్పంచులు, మండల పరిషత్ అధ్యక్షులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ లు మంత్రి ఎర్రబెల్లికి చేతులు జోడించి దండం పెట్టి వేడుకున్నారు. పల్లె ప్రగతికి సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వటం లేదని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని..నిధులు విడుదల చేయడం లేదని బదులిచ్చారు. మీరు గట్టిగా మాట్లాడితే తాను కూడా గట్టిగా మాట్లాడుతానంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు.