నల్గొండ అర్బన్, వెలుగు: గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని పలువురు సర్పంచ్లు మండల పరిషత్ కార్యాలయంలో నిరసన తెలిపారు. గురువారం తిప్పర్తి మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు రొట్టెల రమేశ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15వ ఫైనాన్స్ ద్వారా వివిధ రకాల కాంట్రాక్ట్ పనులు చేయడం వల్ల బిల్లు రాక సర్పంచ్ లు అప్పుల పాలయ్యారని సభ దృష్టికి తెచ్చారు.
దీనికి తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి స్పందిస్తూ అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇదే విషయమై సర్పంచులు అక్కడే ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ మహేంర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యాంసుందర్, సర్పంచ్లు ఎస్కే మోయిజ్, కోన జానయ్య, మైనం నాగయ్య, శ్రీదేవి, తండు జానమ్మ సాయిలు గౌడ్, పిచ్చిరెడ్డి, ఎర్ర మాద కవిత నరేందర్ రెడ్డి, సిరిగిరి పద్మా వెంకటరెడ్డి, నాగరాణి, అంబేద్కర్, పోకల సతీశ్, మార్త శ్రీదేవి సైదులు, కంచర్ల భాస్కర్ రెడ్డి, మంగమ్మ, రామలింగయ్య, ఎంపీటీసీలు ఊట్కూరు సందీప్, పల్లె ఎల్లయ్య, సిరివెన్నెల, ఈదయ్య ఉన్నారు.