ఉద్యోగాలనూ పర్మనెంట్​ చేయండి : అభియాన్

పిట్లం, వెలుగు : తమ ఉద్యోగాలను కూడా పర్మనెంట్ చేయాలని జుక్కల్ నియోజకవర్గంలోని సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరారు. వారు మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్మెల్యే హన్మంత్ షిండే క్యాంపు ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమ జీతాలు పెంచాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ALSO READ :పరిసరాలను క్లీన్​గా ఉంచాలని తెలియదా : విఠల్​రావు