బషీర్ బాగ్, వెలుగు: సిటీలో సర్వ శిక్ష ఉద్యోగుల సమ్మె యథావిధిగా కొనసాగుతున్నది. 25వ రోజైన శుక్రవారం బషీర్ బాగ్ లోని హైదరాబాద్ డీఈవో ఆఫీస్నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మహిళా ఉద్యోగి తెలంగాణ తల్లి వేషధారణలో ఆకట్టుకుంది. తమను విద్యాశాఖలో విలీనం చేసి సర్వీసు క్రమబద్ధీకరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తమ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.