సర్వజ్ఞ స్కూల్ స్టూడెంట్​కు స్టేట్ లెవెల్​లో ఫస్ట్ ఫ్రైజ్

సర్వజ్ఞ స్కూల్ స్టూడెంట్​కు స్టేట్ లెవెల్​లో ఫస్ట్ ఫ్రైజ్

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని వీడీఓఎస్ కాలనీలో ఉన్న సర్వజ్ఞ స్కూల్ లో 5వ తరగతి చదువుతున్న అక్షయ రుత్విక్ కు హైదరాబాద్ లో నిర్వహించిన ఇండియన్ టాలెంటెడ్ ఒలింపియాడ్ మ్యాథ్స్ విభాగంలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో ఫస్ట్ ఫ్రైజ్ లభించిందని స్కూల్ డైరెక్టర్ ఆర్ వీకే నాగేంద్ర కుమార్ తెలిపారు. ప్రశంసా పత్రంతోపాటు స్కాలర్​షిప్ అందుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ఆశించిన లక్ష్యాన్ని సాధించడంలో సర్వజ్ఞ స్కూల్ ముందంజలో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా అక్షయ రుత్విక్ ను స్కూల్ టీచర్లు, స్టాఫ్ అభినందించారు.