Holi 2025: కళ్ళు చెదిరిపోయే వీడియో: హైదరాబాద్ లో 60 అంతస్తుల బిల్డింగ్ పై హోలీ సెలెబ్రేషన్స్..

Holi 2025: కళ్ళు చెదిరిపోయే వీడియో: హైదరాబాద్ లో 60 అంతస్తుల బిల్డింగ్ పై హోలీ సెలెబ్రేషన్స్..

తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి.. హోలీతో పాటు లాంగ్ వీకెండ్ కూడా కలిసిరావడంతో ఫ్యామిలీతో కలిసి హోలీని ఎంజాయ్ చేశారు హైదరాబాదీలు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ బయటికి వచ్చి హోలీ సెలెబ్రేషన్స్ లో పాల్గొనడంతో నిత్యం ట్రాఫిక్ తో నిండిపోయే రోడ్లు ఇవాళ  ( మార్చి 14 ) హోలీ రంగులతో కలర్ ఫుల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో 60 అంతస్తుల బిల్డింగ్ పై హోలీ సెలెబ్రేషన్స్ కి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న దక్షిణ భారతదేశం లోనే అత్యంత ఎత్తైన టవర్ SAS Crown పై స్కై బ్లాస్ట్ హోలీ నిర్వహించారు నిర్వాహకులు. 60 అంతస్తుల భవనంపై నిర్వహించిన ఈ స్కై బ్లాస్ట్ ఆకాశానికి రంగు అద్దినట్లు ఉందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.స్కై బ్లాస్ట్ హోలీలో రంగుల తుఫాన్, 360° స్కై వ్యూ ప్రత్యేకంగా నిలిచాయి. 

Also Read:-హైదరాబాద్ హోలీ వేడుకల్లో గంజాయి మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్క్రీమ్స్, బర్ఫీ స్వీట్స్ తినేశారు..!

హోలీ అంటే సాధారణంగా గ్రౌండ్ లెవల్ లో జరుపుకునే పండుగ, కానీ SAS Crown యాజమాన్యం ఈ సంబరాలను ఆకాశంలో జరపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ స్కై బ్లాస్ట్ ప్రోగ్రాం ద్వారా హోలీ నేల మీదే కాదు, ఆకాశంలోనూ జరుపుకోవచ్చు అని నిరూపించింది SAS Crown.