అడవుల్లోకి మనిషిని పోలిన భారీ గోరిల్లా..జనాల్లోకి వస్తే ఎలా

అడవుల్లోకి మనిషిని పోలిన భారీ గోరిల్లా..జనాల్లోకి వస్తే ఎలా

పెద్ద పెద్ద పాదాలు..పెద్ద పెద్ద చేతులు..భారీ ఆకారంతో అచ్చం మనిషిని తలపించే గోరిల్లా మాదిరి జీవులను మనం పురాణ సినిమాల్లో చూశాం. కొన్ని పుస్తకాల్లోనూ చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఇలాంటి ఆకారంలో గల భారీ జీవి అడవుల్లో తిరుగుతోంది.  ఆహారం కోసం అన్వేషిస్తోంది.   

అడవుల్లో మనిషిని పోలిన భారీ బిగ్ ఫుట్  తిరగడం కలకలం రేపుతోంది. పెద్ద పాదాలు, పెద్ద చేతులు కలిగిన  బిగ్ ఫుట్ జీవి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అడవుల్లో తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తోంది ఈ బిగ్ ఫుట్. గ్రామాల్లోకి చొరబడి ఏం చేస్తుందో అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 

భారీ గోరిల్లా ఎక్కడ..

అమెరికాలో షానన్ పార్కర్, స్టెట్ సన్ అనే ఓ  జంట రైలులో ప్రయాణిస్తోంది. ఈ జంట  కొలరాడో అడవుల్లో ప్రయాణిస్తుండగా..వీరికి ఓ వింత జీవి కనిపించింది. ఈ జీవి అచ్చం  బిగ్ ఫుట్ మృగం లాగే ఉంది. దీంతో వెంటనే వారు ఈ వింతజీవిని వీడియో తీసి  షేర్ చేశారు. ఈ వీడియోలో  ఒక రహస్యమైన, భారీ ఆకారం, పొడవైన జీవి అడవుల్లో సంచరిస్తోంది.  బిగ్‌ఫుట్ అనే పెద్ద మానవరూప జీవిని తలపించడంతో ఆ జంట షాక్ కు గురైంది. 

ALSO READ: 13వేల 500 అడుగుల ఎత్తు నుంచి దూకిన 104ఏళ్ల బామ్మ మృతి