సీఎం కప్‌తో క్రీడారంగ ముఖ చిత్రం మారుతుంది

సీఎం కప్‌తో  క్రీడారంగ ముఖ చిత్రం మారుతుంది
  • శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్‌ శివసేనా రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ సీఎం కప్‌ క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుందన్నారు.  సీఎం కప్ పోటీలు తెలంగాణ క్రీడారంగా ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని శివసేన రెడ్డి అన్నారు.  

సీఎం కప్ టార్చ్‌ రిలే  సోమవారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో శివసేనా రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 3న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన రిలే 33 జిల్లాలను చుట్టొచ్చిందన్నారు.  రాష్ట్రంలో మార్పును ఆహ్వానిస్తున్న యువత సీఎం కప్‌ టార్చ్ రిలేలో భారీ సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.