యాదాద్రి: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఆరెగూడెం రోడ్డులో గల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీ ప్రధాన గేటు వద్దనే క్షుద్ర పూజలు నిర్వహించారు. ఘటనా స్థలంలో నిమ్మకాయలు, కోడి తలలు, పసుపు కుంకుమ, మిరపకాయలు తదితర క్షుద్ర పూజలకు ఉపయోగించిన వస్తువులు పడి ఉన్నాయి.
ఈ కాలేజీలో చుట్టుప్రక్కల గ్రామాల నుండి దాదాపు 400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పిల్లలు చదువుకునే చోట క్షుద్ర పూజలు ఎందుకు నిర్వహించారనేది.. కాలేజీ అధ్యాపకుల్లో, విద్యార్థుల్లో భయాన్ని పుట్తోస్తోంది. కాలేజీ చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం, నైట్ వాచ్మెన్ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు, కాలేజీ లెక్చరర్స్ చెప్తున్నారు. ఈ ఘటన వల్ల కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను కాలేజీకి పంపడానికి ఇష్టపడట్లేదని తెలుస్తోంది.