శాతవాహన యూనివర్సిటీలో కాంట్రాక్టు లెక్చరర్ల నిరసన

శాతవాహన యూనివర్సిటీలో కాంట్రాక్టు లెక్చరర్ల నిరసన

కరీంనగర్ టౌన్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో కాంట్రాక్టు లెక్చరర్లు గురువారం తరగతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత,  సెవెంత్ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్‌‌ చేశారు.

హైదరాబాద్‌‌లోని హయ్యర్​ఎడ్యుకేషన్‌‌ ఆఫీస్​ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపిన కాంట్రాక్ట్ లెక్చరర్లను అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. నిరసనకు విద్యార్థి సంఘాలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మద్దతు ఇచ్చారు. కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ జోసఫ్ రాజ్, కోఆర్డినేటర్స్ రాజు, కృష్ణకుమార్, విజయ్ ప్రకాశ్, అనిల్, అర్చన, లెక్చరర్లు  పాల్గొన్నారు.