
కరీంనగర్ టౌన్,వెలుగు: శాతవాహన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో శుక్రవారం వీసీ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ పీహెచ్ డీ ఎంట్రెన్స్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. వీసీ మాట్లాడుతూ...4 ఫ్యాకల్టీ విభాగాల్లో రిజల్ట్స్ విడుదల చేసినట్లు తెలిపారు. రీసెర్చ్ లో కూడా ముందుకు వెళ్తున్నామని, వర్సిటీ అభివృద్ధికి చాలా అవసరమని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి, ఎగ్జామ్స్ కంట్రోలర్ సురేశ్‌కుమార్, సోషల్ సైన్స్ డీన్ సూరేపల్లి సుజాత, వీసీ ఓఎస్డీ హరికాంత్ ,సిబ్బంది ఉన్నారు.