
కరీంనగర్ టౌన్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను ఎంపీ ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వర్సిటీలోని లైబ్రరీ, ఆడిటోరియం ఆధునీకరణ కోసం ఎంపీ నిధులు, వర్సిటీలో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.10కోట్లు కేటాయించేందుకు వీసీ ప్రతిపాదనలు సమర్పించారు. వర్సిటీలో కొత్తగా ప్రవేశపెడుతున్న లా కాలేజీ కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు స్థానిక ఎంపీగా సిఫారసు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.