హనుమకొండలో రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్‌‌ పోటీలు

హనుమకొండలో రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్‌‌ పోటీలు

హనుమకొండ సిటీ, వెలుగు : తెలంగాణ రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్‌‌ పోటీలు గురువారం హనుమకొండలోని జేఎన్‌‌ఎస్‌‌లో ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలను స్టేట్‌‌ అథ్లెటిక్స్‌‌ అసోసియేషన్‌‌ చైర్మన్‌‌ శివసేనారెడ్డి ప్రారంభించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, అటవీ, దేవాదాయ శాఖ మంత్రికొండా సురేఖ, రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ వర్చువల్‌‌ విధానంలో మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవితంలో క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఆటలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. అథ్లెటిక్స్‌‌ అసోసియేషన్‌‌ చైర్మన్‌‌ శివసేనారెడ్డి మాట్లాడుతూ గత పదేండ్లలో ఆటలకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్నారు. కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌‌రెడ్డి నాయకత్వంలో ఆటలకు నిధులు కేటాయిస్తున్నారన్నారు. కార్యక్రమంలో హనుమకొండ ఇన్‌‌చార్జి కలెక్టర్‌‌ సత్యశారదాదేవి, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ వెంకట్‌‌రెడ్డి, హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌ అజీజ్‌‌ఖాన్‌‌, యువజన క్రీడల అధికారి అశోక్‌‌కుమార్‌‌ పాల్గొన్నారు.