భూమిపైన ఉన్నట్లుగానే చంద్రుడిపైన కూడా శాటిలైట్​ నావిగేషన్​ వ్యవస్థ

భూమిపైన ఉన్నట్లుగానే చంద్రుడిపైన కూడా శాటిలైట్​ నావిగేషన్​ వ్యవస్థ
  • చంద్రుడిపై నావిగేషన్ వ్యవస్థ

భూమిపైన ఉన్నట్లుగానే చంద్రుడిపైన కూడా శాటిలైట్​ నావిగేషన్​ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు బీజింగ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ స్పేస్​ క్రాఫ్ట్​ సిస్టమ్​ ఇంజినీరింగ్​కు చెందిన బృందం ప్రణాళికను రూపొందించింది. ఈ బృందం చంద్రుడి చుట్టూ 21 ఉపగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. చంద్రుడిని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు వీలుగా నాలుగు కక్ష్యల్లో మూడు దఫాల్లో ఈ ఉపగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఇది సుస్థిరమైన తక్కువ ఖర్చుతో కూడుకున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. 

  • చంద్రుడిపై పరిశోధనలకుగాను చైనా లక్ష్యాలను కనుగొనేందుకు ఈ నావిగేషన్​  వ్యవస్థ ఉపయోగపడుతుంది. 
  • 2022లో జపాన్​ శాస్త్రవేత్తలు కూడా చంద్రుడిపై ఎనిమిది శాటిలైట్లతో లూనార్​ నావిగేషన్​ సిస్టమ్​ను ప్రతిపాదించారు. కానీ, అమలుకు నోచుకోలేదు.  
  • ప్రస్తుతం భూమిపై అమెరికాకు చెందిన జీపీఎస్​ నావిగేషన్​ వ్యవస్థ ఉన్నట్టుగానే చైనాకు సైతం బీదౌ పేరుతో సొంత నావిగేషన్ వ్యవస్థ ఉంది.