ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి చెందిన సుమారు 500 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం(అక్టోబర్ 02) స్థానిక ఫంక్షన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వారు తెలిపారు.
నిన్న(అక్టోబర్ 01) సత్తుపల్లిలో జరిగిన మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా తుమ్మలపై చేసిన వ్యాఖ్యలను.. ఆ వర్గం నాయకులు ఖండించారు. దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లిలో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించిన ఆ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని వారు తెలిపారు.