దళిత బంధు అమలు చేసే బాధ్యత నాదే : సండ్ర వెంకట వీరయ్య

సత్తుపల్లి/తల్లాడ, వెలుగు  : బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్తుపల్లి నియోజకవర్గంలో దళితులందరికీ దళిత బంధు అమలు చేసే బాధ్యత తనదేనని సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య భరోసానిచ్చారు. శుక్రవారం తల్లాడ మండలంలో నూతనకల్, మువ్వా గూడూరు, బిల్లుపాడు, వెంకటగిరి, అంజనాపురం, అన్నారుగూడెం తదితర గ్రామాల్లో ఎంపీ బండి పార్థసారథి రెడ్డి, సంబాని చంద్రశేఖర్, కొండూరు సుధాకర్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పే మాయమాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అభివృద్ధి చేసిన వారిని ఆదరించాలని కోరారు. సత్తుపల్లి నియోజకవర్గం లో రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని చెప్పారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వీర మోహన్ రెడ్డి, వెంకటలాల్, ఎంపీపీ శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, ఏఎంసీ వైస్ చైర్మన్ భద్రరాజు, కేతినేని చలపతి, రుద్రాక్ష బ్రహ్మం, దగ్గుల శ్రీనివాసరెడ్డి, దిరిశాల దాసు రావు, తదితరులు పాల్గొన్నారు.

సండ్ర మహాలక్ష్మి ప్రచారం.. 

సండ్ర వెంకట వీరయ్య గెలుపును కాంక్షిస్తూ ఆయన సతీమణి మహాలక్ష్మి శనివారం పట్టణంలోని 20, 22, 23 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను  ప్రజలకు వివరించారు.