మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన .. సత్తుపల్లి డిప్యూటీ డీఎంహెచ్​వో అరెస్ట్

  • రూల్స్​కు విరుద్ధంగా ప్రైవేట్​హాస్పిటల్​ నిర్వహణ
  • పేషెంట్​ చెల్లెలిపై లైంగిక వేధింపులు 
  • ఏపీలో అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు

సత్తుపల్లి, వెలుగు: వైద్యం కోసం వచ్చిన ఓ పేషెంట్ అటెండెంట్​తో అసభ్యంగా ప్రవర్తించిన సత్తుపల్లి డివిజన్​ డిప్యూటీ డీఎంహెచ్​వో  టి.సీతారామ్​ను మంగళవారం ఆంధ్రప్రదేశ్​పోలీసులు అరెస్ట్​ చేశారు. సీతారామ్ ​రూల్స్​కు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్​జిల్లా విసన్నపేటలో కీర్తన జనరల్ దవాఖాన ఏర్పాటు చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు. సత్తుపల్లికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో రెండింటిని మేనేజ్​ చేస్తున్నాడు. ఈ నెల రెండో తేదీన వైద్యం కోసం వచ్చిన ఓ మహిళను దవాఖానలో అడ్మిట్ చేసుకున్నాడు. పేషెంట్​ వెంట అటెండెంట్​గా వచ్చిన ఆమె చెల్లెలితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విసన్నపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి డాక్టర్ సీతారామ్ ను అరెస్ట్ చేశారు. ఈ విషయమై వివరాలు తెలుసుకునేందుకు  డీఎంహెచ్​వోను ఫోన్​లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.