ఇటుకరాళ్ల చెరువును పరిశీలించిన: మట్టా రాగమయి

ఇటుకరాళ్ల చెరువును పరిశీలించిన: మట్టా రాగమయి

కల్లూరు, వెలుగు : కల్లూరు పట్టణ పరిధిలోని ఇటుక రాళ్ల చెరువును సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ సోమవారం పరిశీలించారు. ఆయకట్టు రైతుల సహకారంతో చెరువు గండిని తాత్కాలికంగా పూడ్చేశారు. గండి ప్రదేశంలో పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 

వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పునరావసకేంద్రాలకు తరలించి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్ర గౌడ్, తహసీల్దార్ పులి సాంబశివుడు, జల వనరుల శాఖ ఈఈ లక్ష్మీనారాయణ, డీఈ రాజా రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.