తల్లాడ/జూలూరుపాడు/ములకలపల్లి, వెలుగు : అంగన్వాడీ సెంటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా బలోపేతం చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. శనివారం తల్లాడ ఆర్బీ గార్డెన్ లో లైయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కల్లూరు ప్రాజెక్టు పరిధి ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన పోషణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని పలు సూచనలు చేశారు. జూలూరుపాడులోని గాంధీనగర్లో, ములకలపల్లి మండలం గుండాలపాడులో కూడా సీమంతాలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు చేపట్టారు.
బస్సు పాసులు పంపిణీ
కల్లూరు : కల్లూరు నూతన బస్టాండులో దివ్యాంగులకు 50 శాతం రాయితీతో కూడిన బస్ పాసులను మ్మెల్యే రాగమయి అందజేశారు. ఇందుకు ఆర్థిక సహాయం చేసిన ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కల్లూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆళ్లకుంట నరసింహారావుతోపాటు అదుకు సహకరించిన సత్తుపల్లి విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావును సన్మానించారు. అనంతరం గ్రీన్ ఫీల్డ్ మినీస్టేడియంలో సత్తుపల్లి జోనల్ స్థాయి ఆటల పోటీలను శనివారం ఆమె ప్రారంభించారు.