
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కోట్ల రూపాయిలతో నిర్మించిన పార్కును పరిశీలించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్క్‌లో ఆటవస్తువులు శిథిలావస్తకు చేరుకున్నారు.
కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్ పై దృష్టి సారించాలని,అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు తయారు,అదేవిధంగా అడవి జంతువుల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు...ఊయల,తిరుగుడు బల్లలు,స్ప్రింగ్ ఊయల వంటి పరికరాలు మెయింటెన్స్ లేక నిరుపయోగంగా మారాయి. అడవి జంతువులను పోలే ఏర్పాటు చేసిన బొమ్మలు సైతం విరిగిపోయాయి.
అడవి జంతువుల దాహార్తి తీర్చేందుకు పార్క్ లోని పలు ప్రదేశాల్లో నీటి గుంటలను ఏర్పాటు చేశారు.అయితే వాటిలో నీరు ఉంచకపోవటం తో అడవి జంతువులు పార్కులు దాటి బయటకు వచ్చి ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు.
స్థానికులు సేద తీరేందుకు, అడవి జంతువుల సంరక్షణకు ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్ లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం,అదేవిధంగా అడవి జంతువుల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..