సత్యజిత్ రే ఫ్లాష్ ‘బుక్’

సత్యజిత్ రే ఫ్లాష్ ‘బుక్’

సత్యజిత్ రే.. 1990ల్లో ఇండియన్ సినిమాలకు ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చిన గ్రేటెస్ట్​ ఫిల్మ్​ మేకర్స్ లో ఒకరు . తొలి చిత్రం(పథేర్ పాంచాలి)తోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మల్టీ ట్యాలెంటెడ్ మోషన్ పిక్చర్ డైరెక్టర్ . బెంగాలీ సొసైటీలోని అన్ని సెక్షన్ల ప్రజల జీవితాలను ప్రతిబింబించే ఫీచర్ ఫిల్మ్స్ ని తెరకెక్కించి మెప్పించిన ఆల్ రౌండర్. ఆయన మూవీస్ లో స్టోరీలే హీరోలు, హీరోయిన్లు. పాత్రలను తీర్చిదిద్దటంలో ‘రే’ చూపిన ప్రతిభ ఆయన సినిమాల్లోని ప్రతి సీన్ లో కనిపిస్తుంది. రీడర్లను ఆ రోజుల్లోకి తీసుకెళ్లే ఒక పుస్తకం ఇటీవల విడుదలైంది.

సత్యజిత్ రే చిత్రాల్లో హీరో ఇజమైనా, హీరోయిన్ ఇజమైనా హ్యూమనిజమే. స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ , డైరెక్షన్ .. ఇలా ప్రతి విభాగంలోనూ సినిమాపై పట్టుతప్పనివ్వని పనితనం సత్యజిత్ రే సొంతం. కామెడీ, ట్రాజెడీ, రొమాన్స్, సెంటిమెంట్, విలనిజం తదితర నవ రసాలను పండించే నటీనటులను ఎంపిక చేసుకోవటంలోనూ ఆయనది అందె వేసిన చెయ్యే. ‘జల్సాఘర్’, ‘కాంచనజంగా’ సినిమాల ద్వారా పితృస్వామ్య వ్యవస్థ అవలక్షణాలను వెండి తెరపై ఎండ గట్టారు. ‘మహానగర్’, ‘ప్రతిద్వంది’, ‘సీమబద్ధ’, ‘జన అరణ్య’ మూవీస్ లో యూత్ మోడ్రన్ పోకడలను పట్టి చూపారు. ‘అపరాజితో’, ‘గూపీ జినే బాఘ్య బినే’, ‘హిరక్ రజర్ దేశే’, ‘ఘరే బైరే’ చిత్రాల్లో క్యారెక్టర్లకు నెగెటివ్ షేడ్స్​ని నూటికి నూరు పాళ్లు అద్దారు. ‘అపు త్రిలోగి’, ‘దేవి’ ఫిల్మ్స్ లో తల్లి పాత్రలు మనసుకు హత్తుకుంటాయి. ‘కాపరుష్ ’, ‘చారులత’ పిక్చర్స్​లో స్త్రీల విశిష్టతను గుర్తించాలనే సందేశమిచ్చారు. ఛబీ బిశ్వాస్, అనిల్ ఛటర్జీ​, ద్రిష్టిమాన్ ఛటర్జీ​, సంతోష్ దత్తా, తులసీ చక్రబర్తి, చారుప్రకాష్ ఘోష్ , జహర్ రాయ్, మహబి ముఖర్జీ, సౌమిత్ర ఛటర్జీ, షర్మిలా ఠాకూర్ వంటి గ్రేట్ యాక్టర్లకు తగిన పాత్రలి చ్చారు. యాక్షన్ కనిపించకుండా ఫీలింగ్స్​ మాత్రమే కలిగించటం సత్యజిత్ రే సినిమాల గొప్పతనం.

చాప్టర్లు .. వాటి ‘కేరక్టర్లు ’..
ఫేమస్ ఫిల్మ్​ క్రిటిక్ అమితవ నాగ్ రాసిన ‘సత్యజిత్ రేస్ హీరోస్ అండ్ హీరోయిన్స్​’ పుస్తకం.. లెజెండరీ బెంగాలీ యాక్టర్ సౌమిత్ర ఛటర్జీ చెప్పిన ‘ముందు మాట’తో మొదలైంది. ఇందులో ఆయన సత్యజిత్ రే మూవీస్ లో అడుగడుగునా కనిపించే సహజత్వాన్ని (నేచురాలి టీని) గుర్తుచేశారు. జనవరిలో మార్కెట్ లోకి వచ్చిన ఈ బుక్ లో మొత్తం 11 చాప్టర్లు ఉన్నాయి. ఒక్కో దాంట్లో ఒక్కో ప్రత్యేక అంశాన్ని ప్రస్తావించారు. ఫస్ట్​ చాప్టర్ లో.. పురుషాధిక్యతపై సత్యజిత్ రే తీసిన చిత్రాల గురించి తెలిపారు. రెండో చాప్టర్ లో.. ఆయన సినిమాల్లోని సిటీ హీరోల పాత్రలను మలచిన విధానాన్ని తెలుసుకోవచ్చు. మూడో చాప్టర్ లో.. కమెడియన్ల యాక్టింగ్ స్టైల్స్​ని వివరించారు. నాలుగో చాప్టర్ లో.. సౌమిత్ర ఛటర్జీ పోషించిన విభిన్న పాత్రల విశేషాలను పొందుపరిచారు. సత్యజిత్ రేతో ఎక్కువ (14) సినిమాలు చేసిన యాక్టర్ ఈయనే కావటం గమనార్హం. ఐదో చాప్టర్ లో.. సత్యజిత్ రే చిత్రాల్లోని నెగెటివ్ షేడ్ ఉండే రోల్స్​ గురించి చెప్పారు. ఆరో చాప్టర్ ని పాపులర్ నటుడు ఉత్తమ్ కుమార్ అరంగేట్రం వంటి విషయాలకు కేటాయించారు. బెంగాలీ సినిమాల్లో హీరోగా ఆయన ఎంట్రీని ఆసక్తికరంగా రాశారు. ఏడో చాప్టర్ లో.. తల్లి పాత్రలు పండించిన సెంటిమెంట్ తో ఆకట్టుకున్నారు. ఎనిమిదో చాప్టర్ లో.. సత్యజిత్ రే చిత్రాల్లోని ఉమెన్ ఐడెంటిటీని ప్రతిబింబించారు. తొమ్మిదో చాప్టర్ లో .. ట్రెడిషనల్, మోడ్రన్ లేడీ పాత్రల్లో షర్మిలా ఠాగూర్ చూపించిన వైవిధ్యానికి అద్దం పట్టారు. పదో చాప్టర్ లో.. పిల్లల కోసం ‘రే’ తీసిన మూవీస్ (ముఖ్యం గా ఫెలూద సిరీస్ ) గురించి వెల్లడించారు. ఈ పది చాప్టర్లలో కవర్ కాని హీరోలు, హీరోయిన్లు, వాళ్ల కేరక్టర్ల వివరాలతో ఫైనల్ చాప్టర్ ని పూర్తి చేశారు. ఈ పార్ట్​లన్నీ చదివితే సత్యజిత్ రే క్రియేటివ్ వర్క్​ కళ్ల ముందు కదలాడుతుంది. అయితే, ‘రే’ సినిమాల్లోని ప్లస్ పాయింట్లన్నింటినీ ఈ బుక్ లో వివరించిన రచయిత అమితవ నాగ్.. ఆయన వైఫల్యాలనూ వదిలేయకపోవటం చెప్పుకోదగ్గ విషయం. ఫిల్మ్​ మేకిం గ్ విషయంలో సత్యజిత్ రే కొత్త ప్రయోగాలు చేయకపోవటాన్ని రైటర్ గుర్తించారు. ఆయన చిత్రాల్లోని యాక్టర్ల నటనలో లోపాలను ఇన్ డైరెక్ట్​గా తెలిపారు. ఈ పుస్తకం లో ఎక్కు వ విషయాలు అకడమిక్ బుక్స్​, న్యూస్ పేపర్లలోని ఆర్టికల్స్​తోపాటు సౌమిత్ర ఛటర్జీ ఫుల్ లెన్త్​ ఇంటర్వ్యూ చుట్టూనే తిరగటం ఒక్కటే మైనస్ పాయింట్ . – ‘ది వైర్ ’ సౌజన్యం తో