
ప్రముఖ వ్యాపారవేత్త సానా సతీష్ బాబు మానవత్వం చాటుకున్నారు. ఫౌండేషన్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్ట్ తరపున తన చిన్న నాటి స్నేహితుడు కొటారి సోమేశ్వరరావు మరణించిన విషయం తెలుసుకున్న సతీష్ వెంటనే స్నేహితుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం వారి కుటుంబం గురించి ఆరా తీసి పిల్లలు కె లేఖనా (9 సంవత్సరాలు) కెవిఆర్ ప్రసాద్ (14 సంవత్సరాలు) వారి భవిష్యత్తు, విద్యా ఖర్చులకు తన ట్రస్ట్ తరపున చదివిస్తానని హామీ ఇచ్చారు.
పిల్లల తల్లిదండ్రులు మరణించడంతో ప్రస్తుతం వారు తాత, బామ్మ పరిరక్షణలో ఉంటున్నారు. వారి భవిష్యత్తుకు తాను తీసుకుంటున్నట్లు సతీష్ తెలిపారు.