- బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కు సతీశ్ మాదిగ వార్నింగ్
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేస్తున్న అర్థం పర్థం లేని విమర్శలను సహించేది లేదని కాంగ్రెస్ నేత సతీశ్ మాదిగ హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ మిలాఖత్ అయ్యారని బాల్క సుమన్ ఆరోపించడం కరెక్ట్ కాదన్నారు. గురువారం గాంధీ భవన్లో సతీశ్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణను ఆంధ్రకు అప్పజెప్పుతున్నారని సుమన్ విమర్శించడాన్ని తప్పుపట్టారు.
బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆంధ్రలో కలిపిన ఏడు మండలాల వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకువస్తుందని.. దాని ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందన్నారు. ఆ ఏడు మండలాలపై అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ చర్చకు సుమన్ రావాలని సతీశ్ సవాల్ విసిరారు.