ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు : ఎ.సతీశ్​గణేశన్ ​

కరీంనగర్ టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని  కేంద్ర ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ ఎ.సతీశ్​గణేశన్ ​అన్నారు.  సోమవారం స్థానిక ఎస్ఆర్ఆర్  ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన  కరీంనగర్, మానకొండూర్, హుజూరాబాద్, చొప్పదండి  నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరిశీలించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ సెంటర్లలో నియోజకవర్గాల  వారీగా ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులకు వేర్వేరుగా ఎంట్రన్స్‌‌‌‌లు ఏర్పాటు చేయాలన్నారు. లెక్కింపు సెంటర్‌‌‌‌‌‌‌‌లో పనిచేసే సిబ్బంది ప్రతిఒక్కరికి  ఫొటో గుర్తింపు కార్డులు ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్వోలు ప్రఫుల్ దేశాయ్, మహేశ్వర్, కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌  రామకృష్ణ పాల్గొన్నారు.