హైదరాబాద్: ఫుట్‌బాల్ క్రీడలకు పునర్వైభవం తీసుకురావడానికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్స్) ఫుట్‌బాల్ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో యువ ఫుట్‌బాలర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వీళ్ల కోసం ఆదివారం స్పెషల్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
సాట్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియా ఫుట్‌బాల్ కోచ్‌లు మహేశ్ గ్వాలి, బెనిటో, స్పోర్ట్స్ అథారిటీ కోచ్‌లు రాంబాబు, రతన్ కుమార్, బోస్, వినోద్, మంగిపూడి ప్రసాద్ పాల్గొన్నారు.