యువతే కాంగ్రెస్ కు వెన్నెముక : మట్టా రగమయి

సత్తుపల్లి, వెలుగు  : కాంగ్రెస్ పార్టీకి యువతే వెన్నెముక అని, యువత రాజకీయాల్లోకి రావాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రగమయి అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ క్యాంప్ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆమె జెండా ఎగరవేసి మాట్లాడారు. విద్యార్థి రాజకీయాలకు ఎన్ఎస్​ యూఐ మంచి వేదిక అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది జాతీయ నాయకులు ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, ఎన్ఎస్ యూఐ నియోజకవర్గ అధ్యక్షుడు అర్వపల్లి సందీప్ గౌడ్, సొసైటీ ఉపాధ్యక్షుడు గాదె చెన్నకేశవ రావు, వినుకొండ కృష్ణ, సుబ్బారెడ్డి, దొడ్డాకుల గోపాలరావు, టెక్స్ మో కృష్ణారెడ్డి, బత్తుల భరత్ తదితరులు పాల్గొన్నారు.