హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి తెలంగాణ మహిళలపై ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా కేటీఆర్ చెంపలు వాయించి, ఆయనతో క్షమాపణ చెప్పించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి డిమాండ్ చేశారు. శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారా? ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలను కేటీఆర్ విమర్శిస్తుంటే మీకు చీమ కుట్టినట్లయినా లేదా?
మీకు ఏ మాత్రం ఆత్మ గౌరవం లేదా? అహంకారంతో కేటీఆర్ మహిళలను కించపరిస్తే దీన్ని ఖండించడానికి మీకు నోరు రావడం లేదా?”అని సబిత, సునీతను కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగమయి ప్రశ్నించారు.