కాంట్రాక్టర్​పై డీఎంహెచ్​వోకు ఎమ్మెల్యే ఫిర్యాదు

వేంసూరు, వెలుగు  : పనులు పూర్తి చేయకుండా బిల్లులు డ్రా చేశారని కాంట్రాక్టర్​ పై డీఎంహెచ్​వోకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్​ ఫిర్యాదు చేశారు. వేంసూరు మండల కేంద్రంలోని పీహెచ్​సీని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

గత ప్రభుత్వంలో చేపట్టిన పీహెచ్​సీ స్లాబ్​ వర్క్​ ను కాంట్రాక్టర్​పనులను అసంపూర్తిగా చేసి బిల్లులు డ్రా చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం డీఎంహెచ్​వో కు ఫోన్​ చేసి ఆసుపత్రి భవనం పరిస్థితిని, కాంట్రాక్టర్​ నిర్లక్ష్య వైఖరిని వివరించారు. వెంటనే పీహెచ్​సీలోచేపట్టాల్సిన పనులను పూర్తి చేసి సదరు కాంట్రాక్టర్​ పై చర్యలు తీసుకోవాలని సూచించారు.