చేతకాని హామీలు ఇస్తున్నోళ్లను నమ్మొద్దు

కల్లూరు/తల్లాడ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు నేతలు మాయమాటలు చెబుతున్నారని, చేతకాని హామీలు ఇస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్​ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచిందని చెప్పారు. పెంచిన పెన్షన్ కు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను ఆదివారం ఆయన కల్లూరు, తల్లాడ మండల కేంద్రాల్లో దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్​పాలిత రాష్ట్రాల్లో పెన్షన్​ను రూ.600కు మించి ఇవ్వడం లేదన్నారు. 

ఎన్నికలప్పుడే వచ్చే సీజనల్​లీడర్లను నమ్మితే అభివృద్ధి కుంటుబడుతుందన్నారు. ఎంపీపీ బీరవెల్లి రఘు, జడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, ఎంపీడీఓ బి.రవి కుమార్, కల్లూరు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు డాక్టర్ లక్కినేని రఘు, పసుమర్తి చంద్రరావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, తల్లాడ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీర మోహన్ రెడ్డి, తల్లాడ రైతు సమితి మండల అధ్యక్షుడు వెంకటలాల్, సర్పంచులు పాల్గొన్నారు.