గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలె

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గవర్నర్ తమిళి సైపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్యాంగ బద్దమైన పదవులో ఉంటున్న తమిళి సై.. గవర్నర్ కార్యాలయాన్ని బీజేపీ పార్టీ ఆఫీసుగా మార్చి, ప్రభుత్వ నిర్ణయాలు, కార్యక్రమాలను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రస్తుత గవర్నర్ రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మార్చారని అన్నారు. అనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని కోరారని చెప్పారు. తెలుగు ప్రజల పోరాట ఫలితంగానే అప్పటి గవర్నర్ ను రీకాల్ చేశారని అన్నారు. 

రాజ్ భవన్ లో రాజకీయాలు చేస్తుంటే రాష్ర్ట ప్రజలు సహించరని, తగిన బుద్ది చెప్తారంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత సత్తుపల్లి ఎలా అభివృద్ధి జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరారు.