సత్తుపల్లి, వెలుగు : డిపాజిట్ లేకుండానే 10 శాతం డిస్కౌంట్ తో అద్దెకు ఆర్టీసీ బస్సులు ఇవ్వనున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ యూ.రాజ్యలక్ష్మి తెలిపారు. ఇందుకు సంబంధించిన పాంప్లేట్స్ను గురువారం డిపో ఆవరణలో ఆమె విడుదల చేశారు. శ్రావణమాసం సందర్భంగా ఈనెల 5 నుంచి సెప్టెంబర్ 3 వరకు బస్సులు బుక్ చేసుకున్న వారికి ఈ రాయితీ వర్తిస్తుందని ఆమె తెలిపారు.
డిపాజిట్ లేకుండానే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు తక్కువ చార్జీతో అద్దెకు ఇవ్వనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 9866619189 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి.విజయ శ్రీ, టీఐ సుబ్బారావు, స్టేషన్ మేనేజర్ చందర్రావు, ఏడీసీ జగన్నాథం పాల్గొన్నారు.