బీజేపీది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ : ఎమ్మెల్యే మట్టా రాగమయి

బీజేపీది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ : ఎమ్మెల్యే మట్టా రాగమయి

పెనుబల్లి, వెలుగు: బీజేపీది ప్రచారం ఎక్కువ.. చేసే పని తక్కువని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి విమర్శించారు. పెనుబల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో 68 మందికి రూ.23.59 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్​చెక్కులను గురువారం పంపిణీ చేశారు. అనంతరం జై బాపు, జైభీమ్, జై సంవిధాన్​ కార్యక్రమాన్ని కాంగ్రెస్​జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్​తో కలిసి నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్​అమలు చేస్తున్న పథకాలను చూసి బీజేపీ నాయకులకు కడుపుమంటగా ఉందన్నారు. పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వారికి అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్, కల్లూరు ఏఎంసీ చైర్​పర్సన్​భాగం నీరజాదేవి, వైస్​చైర్మన్​కోటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి పొట్లపల్లి వెంకటేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికి కృషి

కల్లూరు, వెలుగు: పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మట్టా రాగమయి హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్​గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దారా రంగా, ధర్మకర్తలుగా బొప్పన శ్రీనాథ్, వలసాల నరేంద్రబాబు, బొడ్డు పిచ్చయ్య, తోటమణి, కుంచాల వీరయ్య, అజ్మీరా రామకృష్ణలను నియమిస్తూ ఇటీవల ఎండోమెంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఆలయంలో ఎమ్మెల్యే వారితో ప్రమాణ స్వీకారం చేయించి, సన్మానించారు. అంతకుముందు ఆమె దేవతామూర్తులను దర్శించుకొని, పూజలు చేశారు. ఎండోమెంట్ ఖమ్మం ఇన్​స్పెక్టర్ అనిల్ కుమార్, ఆలయ ఈవో సూర్యప్రకాశరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కల్లూరు ఏఎంసీ చైర్​పర్సన్ భాగం నీరజాదేవి, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్​రావు, లక్కినేని కృష్ణ, భాగం ప్రభాకర్, బొల్లం రామారావు, ఆళ్లకుంట నరసింహారావు, కత్తి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.