జ్యోతిష్యం : గ్రహాల న్యాయమూర్తి శని దేవుడు.. ఉగాది నాడు రాశి చక్రం మారుతున్నాడు.. అందరిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?

జ్యోతిష్యం : గ్రహాల న్యాయమూర్తి శని దేవుడు.. ఉగాది నాడు రాశి చక్రం మారుతున్నాడు.. అందరిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?

జ్యోతిషశాస్త్రంలో శ‌నిగ్రహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలామంది శ‌ని భ‌య‌ప‌డుతుంటారు. న్యాయానికి అధిప‌తిగా భావిస్తుండ‌గా.. శ‌ని క‌ర్మ ఫ‌లితాల‌ను ప్రసాదిస్తుంటాడు. ప్రతి వ్యక్తికి తాను చేసిన క‌ర్మల‌ను బ‌ట్టి ఫ‌లితాల‌ను ఇస్తుంటాడు. శ‌నైశ్చరుడి అనుగ్రహం ఉంటే.. వ్యక్తికి క‌ష్టప‌డే త‌త్వం, నిబ‌ద్ధత‌త‌, ఓర్పు త‌దిత‌ర ల‌క్షణాలు అల‌వడుతాయి.  అలాంటి ప్రాముఖ్యత ఉన్న శని దేవుడు ఈ నెల 29న అంటే సూర్యగ్రహణం రోజున తన  స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  మీన రాశిలో శని సంచారం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి.. కష్ట   నష్టాలు ఎలా ఉంటాయి.. పరిష్కార మార్గాలు ఏమిటి? ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసుకుందాం. . .

 శ‌ని గ్రహం  వ్యక్తి జాతకంలో  దోషం ఉంటే  ఉంటే మాత్రం ఇబ్బందుల‌పాల‌య్యే అవ‌కాశం ఉంటుంది, ఆర్థిక‌, ఆరోగ్య స‌మ‌స్యల‌తో పాటు కుటుంబంలో క‌ల‌హాలు, ఉద్యోగంలో ఒత్తిడి త‌దిత‌ర ఇబ్బందులు త‌ప్పవు. అయితే, గ్రహాలు ఒక రాశిని వీడి మ‌రొక రాశిలోకి ప్రవేశిస్తుంటాయి.


జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడు అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. శనీశ్వరుడు అతి నెమ్మదిగా కదులుతాడు. ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటారు. ఈ నెల 29న శ‌నిగ్రహం కుంభ‌రాశి నుంచి మీన‌రాశిలోకి ప్రవేశించ‌నున్నాడు. శని రాశిలో మార్పు కారణంగా, కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి.  శని తన రాశిచక్రాన్ని మార్చుకున్నప్పుడల్లా  ప్రజలపై ఏదో ఒక విధంగా ప్రభావం చూపుతుంది. 

జ్యోతిషశాస్త్రంలో శ‌నిగ్రహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలామంది శ‌ని భ‌య‌ప‌డుతుంటారు. న్యాయానికి అధిప‌తిగా భావిస్తుండ‌గా.. శ‌ని క‌ర్మ ఫ‌లితాల‌ను ప్రసాదిస్తుంటాడు. ప్రతి వ్యక్తికి తాను చేసిన క‌ర్మల‌ను బ‌ట్టి ఫ‌లితాల‌ను ఇస్తుంటాడు. శ‌నైశ్చరుడి అనుగ్రహం ఉంటే.. వ్యక్తికి క‌ష్టప‌డే త‌త్వం, నిబ‌ద్ధత‌త‌, ఓర్పు త‌దిత‌ర ల‌క్షణాలు అల‌వడుతాయి. జీవితంలో ఉన్నత‌స్థాయికి ఎద‌డంతో పాటు స‌మాజంలోనూ గౌర‌వం పొందుతారు.

మీనరాశిలో శని సంచారం వలన దేశ వ్యాప్తంగా చాలా మార్పులు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య  నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ వ్యాపారంతో పాటు స్టాక్ మార్కెట్ కూడా మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో .. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుంది.  రాజకీయంగా కొంత గందరగోళ వాతావరణం.. అకాల వర్షాలతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.  

Also Read:-మార్చి 29 సూర్యగ్రహణం: ఆ సమయంలో చదవాల్సిన మంత్రం ఇదే..

ధర్నాలు.. నిరసనలు.. అరెస్ట్​లు.. గొడవలు జరిగే అవకాశం ఉంది. చాలా  చోట్ల​అధికార మార్పిడి జరుగుతుంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు పెచ్చుమీరడంతో కేసులు పెరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు శాంతి భద్రతలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తాయి. సినీ రంగం, క్రీడా రంగం. సాహితీ వేత్తలు, ఎంటర్​టైన్​ మెంట్​ ఈవెంట్​ చేసే ఆర్టిస్టులు బ్యాడ్​ న్యూస్​ వింటారు.  ప్రపంచ వ్యాప్తంగా వృద్దాప్యంలో ఉన్న రాజకీయనేతల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. 

మీన రాశిలో శని సంచారంప్రతికూల ఫలితాలు .. నివారణ మార్గాలు

  • శనిచారం వలన వచ్చే ఇబ్బందులను కొన్ని పద్దతులను అవలంభిస్తే ఉపశమనం పొందుతారని పండితులు అంటున్నారు. 
  • నిత్యం శివుడిని, హనుమంతుడిని పూజించాలి.
  •  సూర్యాస్తమయం సమయంలో రావి చెట్టు దగ్గర ఆవ నూనె దీపం వెలిగించడం వల్ల శని దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. 
  • ప్రతి మంగళవారం.. శనివారం  రోజులలో హనుమాన్​ చాలీసా.. శనిచాలీసా పారాయణం చేయండి. 
  • శనివారం.. శని భగవానుడికి తైలాభిషేకం చేయండి.. శని త్రయోదశి రోజున  నువ్వుల నూనె దానం చేయండి
  •  శనివారం నాడు ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయాలి. 
  •  శనివారం నాడు నల్ల కుక్కకు ఆవ నూనెతో చేసిన రొట్టె తినిపించండి.