యోసు (కొరియా): ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ కొరియా ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీస్‌లో వరల్డ్ మూడో ర్యాంకర్ సాత్విక్–చిరాగ్ 21–15, 24–22తో రెండో ర్యాంకర్ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) పై గెలిచింది. చైనీస్ ప్రత్యర్థులపై సాత్విక్ జోడీ గెలవడం ఇదే మొదటిసారి. గతంలో తలపడిన రెండుసార్లూ ఓడింది. 40 నిమిషాల మ్యాచ్‌లో రెండు జంటలు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడాయి. దీంతో తొలి గేమ్ 3–3, 5–5తో ముందుకు సాగింది. అయితే ర్యాలీల్లో ఆధిపత్యం చూపెట్టిన సాత్విక్ ద్వయం 7–5, 14–8 లీడ్‌లో నిలిచింది. తర్వాత సాత్విక్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనూ ఇరువురు ప్లేయర్లు ఒకరి తర్వాత ఒకరు పాయింట్లు నెగ్గడంతో స్కోరు బోర్డు 8–8తో సమంగా నిలిచింది. ఈ దశలో చిరాగ్ బేస్ లైన్ షాట్స్‌తో రెండు పాయింట్లు నెగ్గాడు. ఆపై, చైనా ప్లేయర్ కొట్టిన షాట్ వైడ్‌గా వెళ్లడంతో ఇండియా జోడీ 11–8 ఆధిక్యంలో నిలిచింది. ఇక్కడి నుంచి వాంగ్ బ్యాక్ హ్యాండ్ నెట్ షాట్స్‌తో పాయింట్లు రాబట్టడంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. చివరకు 18–18, 19–19, 22–22తో సమమైంది. ఈ సమయంలో నాలుగో గేమ్ పాయింట్‌ను సాత్విక్ క్రాస్ కోర్టు షాట్‌గా మలిచాడు. ఆ వెంటనే చైనీస్ ప్లేయర్ కొట్టిన షాట్ నెట్‌కు తాకడంతో ఇండియా జోడీ విజయం ఖాయమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో సాత్విక్–చిరాగ్... నాలుగోసీడ్ సో యోంగ్–కాంగ్ హి యాంగ్ (కొరియా)తో తలపడతారు.
ఫైనల్లో సాత్విక్‑చిరాగ్
- విదేశం
- July 23, 2023
మరిన్ని వార్తలు
-
Border–Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ సిరీస్.. పిచ్‌లకు ఐసీసీ రేటింగ్
-
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. 12 ఏళ్ళ తర్వాత టాప్-25 నుంచి కోహ్లీ ఔట్
-
NZ vs SL: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. హ్యాట్రిక్‌తో చెలరేగిన శ్రీలంక బౌలర్
-
SA20: రేపే సౌతాఫ్రికా టీ20 లీగ్.. ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్న దినేష్ కార్తీక్
లేటెస్ట్
- ఖమ్మం జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. కోటి రూపాయలు వసూలు చేసిన కాంట్రాక్టు ఉద్యోగి
- V6 DIGITAL 08.01.2025 EVENING EDITION
- Border–Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ సిరీస్.. పిచ్‌లకు ఐసీసీ రేటింగ్
- HAINDAVA Glimpse: ఇంట్రెస్టింగ్ గా బెల్లంకొండ బాబు హైందవ గ్లింప్స్.. హిట్ కొడతాడా..?
- ఏపీ చేరుకున్న ప్రధాని మోడీ.. విశాఖలో భారీ రోడ్ షో
- నో పర్మిషన్.. కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చోవద్దు : హైకోర్టు
- సరికొత్త మోసం: బంగారం, వెండిలో పెట్టుబడి అంటూ.. రూ.13 కోట్లు కొట్టేసిన వ్యాపారి
- ఫార్ములా ఈ కేసు: అరవింద్ కుమార్ ఆదేశాలతోనే రూ.54 కోట్లు బదిలీ: BLN రెడ్డి
- ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. 12 ఏళ్ళ తర్వాత టాప్-25 నుంచి కోహ్లీ ఔట్
- ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు.. అతి త్వరలో గ్రూప్ -1, 2, 3 ఫలితాలు: బుర్రా వెంకటేశం
Most Read News
- హైదరాబాద్‌లో 11 HMPV కేసులు.. మాయదారి చైనా వైరస్.. డిసెంబర్లోనే తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చేసిందంట..!
- హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్.. ఏంటి వీటి ప్రత్యేకత?
- సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేకుండానే ఇన్వెస్ట్ చేయొచ్చు.. 9.1 శాతం వరకు వడ్డీ ఇస్తాం: టాటా కీలక ప్రకటన
- పండుగ వేళన పొంచి ఉన్న హాలిడే హార్ట్ సిండ్రోమ్.. కార్డియాక్ అరెస్ట్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
- ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్ : రూ.10 లక్షల వరకు ఇన్‌కం ట్యాక్స్ లేదంటగా..!
- ట్రిపుల్ ఆర్ భూసేకరణపై స్పీడప్.. మెప్పించి.. ఒప్పించి రైతులకు పరిహారం!
- Yuzvendra Chahal: మరో అమ్మాయి బౌల్డ్.. 'మిస్టరీ గర్ల్'తో యుజ్వేంద్ర చాహల్
- జగిత్యాల హాస్పిటల్లో ల్యాబ్ సిబ్బంది దందా
- బతుకమ్మకుంట ప్రభుత్వానిదే.. హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు
- Game Changer: గేమ్ ఛేంజర్ రివ్యూ ఇచ్చినందుకు.. మా ఇళ్లపై దాడులు చేస్తున్నారు : ఉమైర్ సంధు