మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో రన్నరప్‌‌‌‌‌‌‌‌గా సాత్విక్‌‌‌‌‌‌‌‌ జోడీ

మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో  రన్నరప్‌‌‌‌‌‌‌‌గా సాత్విక్‌‌‌‌‌‌‌‌ జోడీ

షెన్‌‌‌‌‌‌‌‌జెన్‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్లు సాత్విక్‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ షెట్టి జోడీ.. చైనా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో రన్నరప్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ 19–21, 21–18, 19–21తో వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ జంట లియాంగ్‌‌‌‌‌‌‌‌ వీ కెంగ్‌‌‌‌‌‌‌‌–వాంగ్‌‌‌‌‌‌‌‌ చాంగ్‌‌‌‌‌‌‌‌ (చైనా) చేతిలో ఓడారు. దీంతో ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఆడిన ఆరు ఫైనల్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ ద్వయం ఓడటం ఇదే తొలిసారి. గంటా 11 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌ను చేజార్చుకున్న సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లో అదరగొట్టింది. 

ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనా కీలక టైమ్‌‌‌‌‌‌‌‌లో క్రాస్‌‌‌‌‌‌‌‌ కోర్టు విన్నర్స్‌‌‌‌‌‌‌‌, స్మాష్‌‌‌‌‌‌‌‌లతో గేమ్‌‌‌‌‌‌‌‌ గెలిచి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌‌‌‌‌‌‌‌ ఆరంభంలో చైనా జంట ఆధిపత్యం చూపెట్టింది. సుదీర్ఘమైన ర్యాలీలతో పాటు నెట్‌‌‌‌‌‌‌‌ వద్ద డ్రాప్స్‌‌‌‌‌‌‌‌ వేస్తూ 8–1, 20–13తో దూసుకెళ్లింది. కానీ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌‌‌‌‌ అదరగొట్టాడు. చిరాగ్‌‌‌‌‌‌‌‌ కచ్చితమైన రిటర్న్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తూ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 19–20తో నిలిచారు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో చైనీస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు కొట్టిన స్మాష్‌‌‌‌‌‌‌‌ను తీయలేకపోయిన ఇండియన్‌‌‌‌‌‌‌‌ జోడీ గేమ్‌‌‌‌‌‌‌‌ను, మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను చేజార్చుకుంది.