ఇండోనేసియా మాస్టర్స్‌‌ సూపర్‌‌–500 టోర్నీ ప్రిక్వార్టర్స్‌‌లో సాత్విక్‌‌–చిరాగ్‌‌

ఇండోనేసియా మాస్టర్స్‌‌ సూపర్‌‌–500 టోర్నీ ప్రిక్వార్టర్స్‌‌లో సాత్విక్‌‌–చిరాగ్‌‌

జకర్తా : ఇండియా స్టార్‌‌ డబుల్స్‌‌ షట్లర్లు సాత్విక్‌‌ సాయిరాజ్‌‌–చిరాగ్‌‌ షెట్టి.. ఇండోనేసియా మాస్టర్స్‌‌ సూపర్‌‌–500 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌‌లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన మెన్స్‌‌ డబుల్స్‌‌ తొలి రౌండ్‌‌లో సాత్విక్‌‌–చిరాగ్‌‌ 21–16, 21–15తో చెన్‌‌ జి రే–లిన్‌‌ యు చిహ్‌‌ (చైనీస్‌‌తైపీ)పై గెలిచారు. 

విమెన్స్‌‌ డబుల్స్‌‌ తొలి రౌండ్‌‌లో అశ్విని పొనప్ప–తనీషా క్రాస్టో 21–6, 21–14తో ఒర్నిచా– సువాచాయ్ (థాయ్‌‌లాండ్‌‌)ను ఓడించారు. మెన్స్‌‌ సింగిల్స్‌‌ క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఆయుష్‌‌ షెట్టి 21–7, 21–15తో స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌‌పై సంచలన విజయం సాధించాడు.