మలేసియా ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–1000 టోర్నీ సెమీస్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌

కౌలాలంపూర్‌‌‌‌ : ఇండియా డబుల్స్‌‌‌‌ స్టార్‌‌‌‌ షట్లర్లు సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి.. మలేసియా ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–1000 టోర్నీలో వరుసగా మూడోసారి సెమీస్‌‌‌‌లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ 26–24, 21–15తో మలేసియా ద్వయం యు సిన్‌‌‌‌ ఒంగ్‌‌‌‌–ఈ యి టియోపై గెలిచారు. 49 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ఇరు జంటల మధ్య తొలి గేమ్‌‌‌‌ హోరాహోరీగా సాగింది. స్టార్టింగ్‌‌‌‌లో దూకుడుగా ఆడిన సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ వరకు 11–9 లీడ్‌‌‌‌లో నిలిచారు.

అదే జోరుతో ఆధిక్యాన్ని 18–16కు పెంచుకున్నారు. ఈ దశలో ఎక్కువగా ర్యాలీలు ఆడిన మలేసియా ప్లేయర్లు వరుసగా మూడు పాయింట్లు సాధించి 19–19తో స్కోరు సమం చేసి 20–19 లీడ్‌‌‌‌లోకి వెళ్లారు. ఇక గేమ్‌‌‌‌ చేజారుతున్న టైమ్‌‌‌‌లో అద్భుతంగా పోరాడిన సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ నాలుగు గేమ్‌‌‌‌ పాయింట్లను కాచుకుని తొలి గేమ్‌‌‌‌ను సాధించారు. రెండో గేమ్‌‌‌‌లో మలేసియన్లకు మెరుగైన ఆరంభం దక్కడంతో 11–8తో ముందుకెళ్లారు. అయితే చిరాగ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్‌‌‌‌తో వరుసగా పాయింట్లు సాధించాడు. 17 పాయింట్లలో ఏకంగా 13 నెగ్గి గేమ్‌‌‌‌తో పాటు మ్యాచ్‌‌‌‌ను సొంతం చేసుకున్నారు.