షెన్జెన్ (చైనా) : గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి టైటిల్ దిశగా దూసుకెళ్తున్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్లో సెమీఫైనల్ చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ 21–16, 21–19తో వరుస గేమ్స్‌లో వరల్డ్ నం.2, రెండో సీడ్ కిమ్ అస్ట్రుప్–ఆండ్రెస్ స్కారుప్పై (డెన్మార్క్) విజయం సాధించారు.
గత ఎడిషన్‌లో ఫైనల్ చేరిన ఇండియా స్టార్స్ సెమీస్‌లో కొరియాకు చెందిన జిన్ యోంగ్–సియో సుయెంగ్ జయెతో పోటీ పడనున్నారు. మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 18–21, 15–21తో డెన్మార్క్ షట్లర్, మూడో సీడ్ ఆండెర్స్ ఆంటోన్సెన్ చేతిలో వరుస గేమ్స్‌లో ఓడిపోయాడు. దాంతో ఈ టోర్నీలో ఇండియా నుంచి సాత్విక్–చిరాగ్ మాత్రమే మిగిలారు.