దుబాయ్: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మెన్స్ డబుల్స్‌లో 52 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాకు మెడల్ రానుంది. మెగా టోర్నీలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి సెమీఫైనల్ చేరి పతకం ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన మెన్స్ డబుల్స్ క్వార్టర్స్‌లో ఆరో సీడ్ సాత్విక్–చిరాగ్ జంట 21–11, 21–12తో మూడో సీడ్ మొహమ్మద్ అహ్‌సాన్–హెండ్ర సెతైమన్ (జపాన్)పై అద్బుతం విజయం సాధించింది.
కానీ, సింగిల్స్‌లో స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ఇద్దరూ ఇంటిదారి పట్టారు. విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ సింధు 21–18, 5–21, 9–21తో రెండో సీడ్ అన్ సె యంగ్ (కొరియా) చేతిలో ఓడింది. మెన్స్ క్వార్టర్స్‌లో జపాన్ షట్లర్ కంటా సునెయమతో పోటీ పడ్డ ప్రణయ్ 11–21, 9–13తో వెనుకంజలో ఉన్న టైమ్‌లో గాయంతో రిటైర్ అయ్యాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ ఇండియాకు నిరాశే ఎదురైంది. సిక్కిరెడ్డి–రోహన్ కపూర్ జంట 18–21, 21–19, 15–21తో గ్లోరియా–డెజన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది.