
భారత షట్లర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఇంట విషాదం నెలకొంది. అతని తండ్రి ఆర్ కాశి విశ్వనాథం గురువారం(ఫిబ్రవరి 20) ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. సాత్విక్ గురువారం ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డు అందుకోనుండగా.. ఆ వేడుకల్లో పాల్గొనడానికి ఆయన ఢిల్లీ బయలుదేరే కొద్దిసేపటి ముందు ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
బ్యాడ్మింటన్‌లో సాత్విక్ విజయాలు
చిరాగ్ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్ ఆడే సాత్విక్ భారత బ్యాడ్మింటన్‌లో కీలక ప్లేయర్. ఈ జంట 2022 ఆసియా క్రీడలు, 2022 కామన్వెల్త్ క్రీడలు, 2023 ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(BWF) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానానికి చేరుకున్న జంట, BWF వరల్డ్ టూర్ సూపర్ 1000 టైటిల్ గెలుచుకున్న ఏకైక భారతీయ జంట వీరే.
సాత్విక్ సాయిరాజ్ స్వస్థలం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురం. సాత్విక్ 2023లో గంటకు 565 కి.మీ. వేగంతో బ్యాడ్మింటన్ స్మాష్ ఆడి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.