టైటిల్‌‌‌‌‌‌‌‌పై సాత్విక్‌‌‌‌‌‌‌‌ జోడీ-గురి..నేటి నుంచి ఇండోనేసియా ఓపెన్‌‌‌‌‌‌‌‌

టైటిల్‌‌‌‌‌‌‌‌పై సాత్విక్‌‌‌‌‌‌‌‌ జోడీ-గురి..నేటి నుంచి ఇండోనేసియా ఓపెన్‌‌‌‌‌‌‌‌

జకార్తా : వరుసగా రెండు టోర్నమెంట్లలో సెమీఫైనల్స్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టిన ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌–చిరాగ్ షెట్టి సీజన్‌‌‌‌‌‌‌‌లో తొలి టైటిల్‌‌‌‌‌‌‌‌ అందుకోవడమే లక్ష్యంగా ఇండోనేసియా మాస్టర్స్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 500 టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగుతున్నారు. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీలో 9వ ర్యాంకర్స్‌‌‌‌‌‌‌‌ సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్ చైనీస్ తైపీకి చెందిన చెన్ జి రే–యు చియా లిన్‌‌‌‌‌‌‌‌తో పోరు ఆరంభించనున్నారు. మెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌  జపాన్ ప్లేయర్ తకుమా ఒబయాషితో ఈ టోర్నీ మొదలు పెట్టనున్నాడు. 

సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌ ఆడనుండగా.. కిరణ్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌, ప్రియాన్షు రజావత్ కూడా బరిలో నిలిచారు. ఫామ్‌‌‌‌‌‌‌‌ కోల్పోయి ఇబ్బందిపడుతున్న పీవీ సింధు తైపీ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుంగ్ షువో యున్‌‌‌‌‌‌‌‌తో పోటీ పడనుండగా.. ఆకర్శి కశ్యప్‌‌‌‌‌‌‌‌ జపాన్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవోమి ఒకుహరాతో కఠిన సవాల్‌‌‌‌‌‌‌‌ ఎదుర్కోనుంది. డబుల్స్‌‌‌‌‌‌‌‌లో తనీషా క్రాస్టో–అశ్విని, మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌లో రోహన్ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గద్దె రుత్విక బరిలో నిలిచారు.