సాత్విక్‌‌‌‌కు పితృవియోగం

సాత్విక్‌‌‌‌కు పితృవియోగం

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌ రాంకిరెడ్డి ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి కాశీ విశ్వనాథం (65) గుండెపోటుతో గురువారం ఉదయం మరణించారు. ప్రస్తుతం పీఎస్‌‌‌‌పీబీ ఇంటర్‌‌‌‌ యూనిట్‌‌‌‌ టోర్నీ కోసం ఢిల్లీలో ఉన్న సాత్విక్‌‌‌‌ గురువారం ప్రతిష్టాత్మక ‘ఖేల్‌‌‌‌ రత్న’ అవార్డు అందుకోవాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి అతని తండ్రి కూడా హాజరుకావాల్సి ఉంది. కాశీ విశ్వనాథం వ్యాయామ ఉపాధ్యాయుడిగా రిటైర్‌‌‌‌ అయ్యారు.

ఇక ఇండియా తరఫున బ్యాడ్మింటన్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో చిరాగ్‌‌‌‌ షెట్టితో కలిసి బరిలోకి దిగిన సాత్విక్‌‌‌‌.. 2022 ఆసియా గేమ్స్‌‌‌‌, కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌, 2023 ఆసియా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్స్ గెలిచాడు.  బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌లో నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌తో పాటు వరల్డ్‌‌‌‌ టూర్‌‌‌‌ సూపర్‌‌‌‌–1000 టైటిల్‌‌‌‌ నెగ్గిన ఇండియన్‌‌‌‌ తొలి జంటగా రికార్డులకెక్కింది. 2023లో ఫాస్టెస్ట్‌‌‌‌ స్మాష్‌‌‌‌ (565 కి.మీ/ గంట)  కొట్టిన ప్లేయర్‌‌‌‌గా సాత్విక్‌‌‌‌ గిన్నిస్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ రికార్డును కూడా సంపాదించాడు.