
కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించాడు. కాజల్ కెరీర్‌లో ఇది 60వ చిత్రం. ఈ నెలాఖరులో విడుదల కావాల్సి ఉంది. అయితే గురువారం కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. వారం రోజులు ఆలస్యంగా.. అంటే జూన్ 7న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ నటించింది.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ఇందులో అమరేందర్ అనే కీలక పాత్రను నవీన్ చంద్ర పోషిస్తున్నాడు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్’ దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందించాడు.