సత్యదేవ్, డాలీ ధనంజయ లీడ్ రోల్స్‌లో డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ రూపొందించిన చిత్రం ‘జీబ్రా’. ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు. ప్రియా భవానీ శంకర్ కీ రోల్లో నటించిన జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్స్లో రిలీజయింది.
జీబ్రా ఓటీటీ:
భారీ అంచనాల మధ్య ఆర్థిక నేరాల నేపథ్యంలో తెరకెక్కిన జీబ్రా మూవీకి మౌత్‌టాక్ బానే వచ్చింది. దీంతో ఫస్ట్ వీక్ ఓ మోస్తరు కలెక్షన్స్ తో మెప్పించింది. ఇపుడీ ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయాన్నిఆహా ఓటీటీ గురువారం (డిసెంబర్ 12) ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "థ్రిల్లింగ్ రైడ్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ను ఆహాలో త్వరలో చూడటానికి సిద్ధంగా ఉండండి" అంటూ పోస్ట్ చేసింది.
అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మాత్రం చెప్పలేదు. డిసెంబర్ థర్డ్ వీక్లో జీబ్రా మూవీ స్ట్రీమింగ్కి వస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే రేపే (డిసెంబర్ 13 న) వచ్చే అవకాశం ఉంది. లేదంటే డిసెంబర్ 20న ఐన వస్తోంది. ఇక ఎప్పుడొచ్చిన తెలుగు, తమిళ భాషల్లో జీబ్రా స్ట్రీమింగ్కి వచ్చేస్తుంది. ఈ వీక్ లో జీబ్రా ఓటీటీ రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Get ready to witness a thrilling ride and non-stop entertainment soon on #aha#Zebra #ZebraOnAha @ActorSatyaDev @Dhananjayaka @priya_Bshankar @suneeltollywood @JeniPiccinato @amrutha_iyengar pic.twitter.com/xGMNA2T3sF
— ahavideoin (@ahavideoIN) December 12, 2024
జీబ్రా కథ:
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా,ఆర్థిక నేరాల నేపథ్యంలో క్రైమ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా జీబ్రా మూవీని తెరకెక్కించారు. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గతంలో బ్యాంక్‌లో పని చేశారు. ఆయన చూసిన ఇన్సిడెంట్స్‌తో పాటు ఇంకొన్ని ట్రూ ఇన్సిడెంట్స్‌తో ఈ కథని రాసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇటీవలే బ్యాంకింగ్ నేపథ్యంలో వచ్చిన లక్కీ భాస్కర్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే, లక్కీ భాస్కర్ పూర్తిగా పీరియాడిక్ జోనర్లో వచ్చిన కథ. జీబ్రా కాంటెంపరరీ స్టొరీ. దేనికదే డిఫరెంట్ స్టోరీ.
ALSO READ | Keerthy Suresh Wedding: చిరకాల స్నేహితుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్.. ఫోటోలు వైరల్
ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ అనేది పూర్తిగా డిజిటల్ అయింది. అంటే, ఎలాంటి క్రైమ్ అయిన బయట వ్యక్తులు చేసే అవకాశం చాలా తక్కువ. బ్యాంకులో పని చేసే వాళ్లకి తప్పితే కామన్ పీపుల్ కి అక్కడ జరిగే మిస్టేక్స్ తెలీవు. అయితే, ఈ విషయంలో డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ గతంలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసిన అనుభవాన్ని ప్రేక్షకుల అర్ధమయ్యే శైలిలో తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు.