చెంచుల జీవన విధానంపై కేంద్రానికి నివేదిక

చెంచుల జీవన విధానంపై కేంద్రానికి నివేదిక
  •  ఎన్ఐఆర్డీ కోఆర్డినేటర్​ సత్య రంజన్​ మహాకుల్​

అచ్చంపేట, వెలుగు: నల్లమల ప్రాంతంలో చెంచుల జీవన విధానాన్ని అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఎన్ఐఆర్డీ ( నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ రూరల్​ డెవలప్​మెంట్) శిక్షణ బృందం కో ఆర్డి నేటర్​ సత్య రంజన్​ మహాకుల్​ తెలిపారు. 9 రాష్ట్రాలకు చెందిన 55 మంది బుధవారం బల్మూర్​ మండలం గుడిబండ గ్రామంలో పర్యటించారు. చెంచు కుటుంబాల జీవన విధానం, వారి సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, వారికి అవసరమైన సౌలతులను అడిగి తెలుసుకున్నారు. 

సభ్యులు ఐదు గ్రూపులుగా ఏర్పడి ప్రతీ ఇంటికి తిరిగి సమస్యలు, ఇతర అంశాలను తెలుసుకొని నమోదు చేసుకున్నారు. ఈ సమాచారాన్ని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అంద జేయనున్నట్లు తెలిపారు. డీఆర్డీవో నర్సింగరావు. అడిషనల్​ డీఆర్డీవో రాజేశ్వరి, డీఎల్పీవో వెంకటయ్య, ఏపీడీ శ్రీనివాసులు, ఎంపీడీవో దేవన్న పాల్గొన్నారు.