- యువత సమాజ మార్పునకు కృషి చేయాలి
- ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: యువత సమాజ మార్పునకు కృషి చేయాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. మంగళవారం మాజీ విద్యాశాఖ అధికారి డాక్టర్ విజయ కుమార్ చేపట్టిన బాపు బాటలో సత్యశోధన పాదయాత్ర నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ ఏ ఒక్కరి వారు కాదన్నారు.
యువత మత్తుకు బానిస కాకుండా సమాజాన్ని మార్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ గాంధేయవాది విశ్రాంత ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ నాగసూరి వేణుగోపాల్, ప్రసాద్, తెలంగాణ గాంధీ స్మారక నిధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగారావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.