
సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) నటించిన లేటెస్ట్ మూవీ సత్యభామ(Satyabhama). లేడీ ఓరియెంటెడ్ కథతో క్రైం థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు సుమన్ చిక్కాల తెరకెక్కిస్తుండగా.. క్షణం, గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు పెంచిన ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర యూనిట్.. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చారు.
అదేంటంటే.. ఈ సినిమా చూసే ఆడవాళ్ళకి బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. అదేంటంటే.. జూన్ 7 సత్యభామ మూవీ థియేటర్స్ లోకి రానుండగా అంతకన్నా రెండురోజుల ముందు అంటే జూన్ 5న హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ ప్రీమియర్స్ కి హీరోయిన్ కాజల్ కూడా హాజరుకానున్నారు. ఈ షోకి ఆడవాళ్ళకి ఎంట్రీ ఫ్రీ అంటూ ప్రకటించారు.
Today is a lovely day?
— Aurum Arts Official (@AurumArtsOffl) June 5, 2024
Why? Because you can join @MSKajalAggarwal for the #Satyabhama Premiere with your family!
All you gotta do is
Show the #SheSafe App
?@PrasadsCinemas
?️ June 5, 2024
? 6:00 PM
Install the App now!#Satyabhama Grand Release Worldwide on June 7th ?… pic.twitter.com/AHt2SGMDH6
అయితే.. ఫ్రీ టికెట్ పొందడానికి కేవలం మీ మొబైల్ లో షీ సేఫ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 5న హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ టికెట్ కౌంటర్ లో షీ సేఫ్ ఇన్స్టాల్ చేసినట్టుగా చూపించి టికెట్ తీసుకోవచ్చు. అలా సత్యభామ సినిమాను కాజల్ తో కలిసి చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు మేకర్స్. మరి ఎందుకు ఆలస్యం.. మీ మొబైల్ లో షీ సేఫ్ యాప్ డౌన్లోడ్ చేసి సత్యభామ సినిమా చూసేయండి.