Crime Thriller OTT: ఆహా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ

Crime Thriller OTT: ఆహా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ

భారీ అంచనాల మధ్య ఆర్థిక నేరాల నేపథ్యంలో తెరకెక్కిన మూవీ జీబ్రా (Zebra). ఇవాళ డిసెంబర్ 20న ఓటీటీలోకి వచ్చేసింది. సత్యదేవ్, డాలీ ధనంజయ లీడ్ రోల్స్‌‌లో డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ రూపొందించిన ఈ చిత్రం (నవంబర్ 22)న థియేటర్స్లో రిలీజై మెప్పించింది. ఇపుడీ ఈ మూవీ ఆహా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. 

అయితే, బుధవారం (Dec 18)న ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్ళకి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. నేడు సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారందరూ చూసేలా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో జీబ్రా స్ట్రీమింగ్కి  వచ్చిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ కీ రోల్లో నటించింది.

జీబ్రా కథ:

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా,ఆర్థిక నేరాల నేపథ్యంలో క్రైమ్ యాక్షన్ ఎంటర్‌‌ టైనర్‌‌‌‌గా జీబ్రా మూవీని తెరకెక్కించారు. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గతంలో బ్యాంక్‌లో పని చేశారు. ఆయన చూసిన ఇన్సిడెంట్స్‌తో పాటు ఇంకొన్ని ట్రూ ఇన్సిడెంట్స్‌తో ఈ కథని రాసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇటీవలే బ్యాంకింగ్ నేపథ్యంలో వచ్చిన లక్కీ భాస్కర్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే, లక్కీ భాస్కర్ పూర్తిగా పీరియాడిక్ జోనర్లో వచ్చిన కథ. జీబ్రా కాంటెంపరరీ స్టొరీ. దేనికదే డిఫరెంట్ స్టోరీ. 

ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ అనేది పూర్తిగా డిజిటల్ అయింది. అంటే, ఎలాంటి క్రైమ్ అయిన బయట వ్యక్తులు చేసే అవకాశం చాలా తక్కువ. బ్యాంకులో పని చేసే వాళ్లకి తప్పితే కామన్ పీపుల్ కి అక్కడ జరిగే మిస్టేక్స్ తెలీవు. అయితే, ఈ విషయంలో డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ గతంలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసిన అనుభవాన్ని ప్రేక్షకుల అర్ధమయ్యే శైలిలో తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు.