పాన్ ఇండియా జీబ్రా

పాన్ ఇండియా జీబ్రా

డిఫరెంట్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌ సినిమాలతో మెప్పిస్తున్న సత్యదేవ్, కన్నడ హీరో డాలీ ధనుంజయతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఇద్దరు హీరోలకూ ఇది 26వ చిత్రం. ఇదొక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. ‘పెంగ్విన్’ ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. గురువారం ఈ మూవీ టైటిల్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. ‘జీబ్రా’ అనే వెరైటీ టైటిల్‌‌‌‌ను ఫిక్స్ చేశారు. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ (అదృష్టం ధైర్యవంతులకు అనుకూలం) అనేది ట్యాగ్ లైన్. టైటిల్‌‌‌‌ లోగోతో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

ప్రియ భవానీ శంకర్, జెన్నిఫర్ పిచినెటో హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, సునీల్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎన్.రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం కలిసి నిర్మిస్తున్నారు. ‘50 రోజుల ఫస్ట్ షెడ్యూల్‌‌‌‌ని పూర్తి చేశాం. మిగిలిన షూట్‌‌‌‌ను హైదరాబాద్, కోల్‌‌‌‌కతా, ముంబైలలో పిక్చరైజ్ చేస్తాం. ‘కేజీఎఫ్‌‌‌‌’ ఫేమ్ రవి బస్రూర్‌‌‌‌ అందిస్తున్న మ్యూజిక్ హైలైట్‌‌‌‌ అవుతుంది’ అని నిర్మాతలు చెప్పారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. సత్యదేవ్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.